డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లలో 5% వారికే కేటాయిస్తాం.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-12-03 07:37:33.0  )
niranjan
X

దిశ, వనపర్తి‌: చేయాలనే కృషి ఉంటే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చునని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ, వికలాంగుల సంక్షేమ శాఖ, డి‌ఆర్‌డి‌ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తపన ఉంటే దివ్యాంగులు కూడా సవ్యాంగులకు ధీటుగా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చునని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రపంచం‌లోనే నూతన అధ్యాయాన్ని లిఖించి, అందరికీ ఆదర్శంగా నిలిచిన స్టీఫెన్ హాకింగ్ దివ్యాంగులు అన్నా విషయం మర్చి పోకూడదన్నారు.

ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని తపన, పట్టుదలతో వాటిని సాధించేందుకు ప్రయత్నించాలని ఆయన అన్నారు. రాష్ట్రానికే తలమాణికంగా వనపర్తి నియోజకవర్గం‌లో వికలాంగుల సంక్షేమ భవనంను అడ్మిన్ ఇచ్చేందుకు స్థల సేకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. నియోజకవర్గం‌లో ప్రభుత్వం పేద ప్రజలకు నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ గృహాలలో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తామన్నారు. 30 మంది దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రాలను మంత్రి అందజేశారు.

అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదు.. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

దివ్యాంగులు అధైర్య పడవద్దని మానసికంగా దృఢంగా ఉండాలని, అంగవైకల్యం శరీరానికే తప్ప మనస్సుకు కాదు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు అన్నివేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, డి‌ఆర్‌డి‌ఓ నర్సింహులు, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, మున్సిపల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డి, మహిళా శిశు,వికలాంగుల సంక్షేమ అధికారి పుష్పలత, ప్రభాకర్, కమిటీ సభ్యులు జహంగీర్, దివ్యాంగులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed