- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరద ముంపులోనే డబుల్ బెడ్రూం ఇండ్లు
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ సర్వే నెంబర్ 126లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇంకా వరద ముంపు నుంచి బయటపడలేదు. సెల్లార్లలోని నీరు ఇప్పటికీ బయటకు వెళ్లలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు మొత్తానికి ముప్పు వాటిల్లుతుందని, సుమారు రూ.100 కోట్లతో 1,260 డబుల్ బెడ్ రూం ఇళ్లకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతం మాసాబ్ చెరువు దిగువన ఉండటం,పక్క నుంచే వరద కాలువ పారుతుండటంతో వర్షాకాలంలో నీరంతా ఇక్కడ నుంచే వెళ్లి నిర్మాణం మొత్తం నీట మునిగింది.
సుమారు రెండు నెలల పాటు నీటి ప్రవాహం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మీదుగానే సాగింది. దీంతో పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నాలుగు నెలల నుంచి ఇప్పటికీ సెల్లారు గుంతల్లో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. ఎన్ని మోటార్లు పెట్టి బయటకు పంపినా నీరు అలాగే ఉంటోంది. తాజాగా మాసాబ్‌చెరువు తూము తీయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నీరు చాలా ఉరవడితో వరద కాలువ నుంచి పారుతుండటం తో సెల్లార్ గుంతల్లో నీటి మట్టం మళ్లీ పెరిగి పనులు నిలిచిపోయాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతం నల్లరేగడి నేల కావడంతో బ్లాకుల్లో నీరు ఊరుతోందని, పనుల్లో జాప్యం కొనసాగుతోందని అధికారులు అంటున్నారు.
భవిష్యత్‌లో ఇళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపడతామ ని, ఈ విషయాన్ని ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు.డబుల్ బెడ్ రూం ఇళ్ల పై ప్రాంతంలో ఆక్రమణలను ఇరిగేషన్ అధికారులు గుర్తించి, కబ్జాలను తొ లగించి నీళ్లు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని, వరద కాలువను విస్త రించి నీరు పక్కకు వెళ్లకుండా పటిష్టంగా ప్ర హరీగోడ నిర్మాణం చేపట్టాలని స్థాని కులు కోరుతున్నారు.
పేదల ప్రాణాలతో చెలగాటం..
పేదలకు ఒక న్యాయం.. పెద్దొళ్లకు ఒక న్యాయమా? పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వం అలసత్వం విడనాడాలి. ముంపు ప్రాంతమని తెలిసినా ఇక్కడ ఎలా నిర్మాణాలు చేపడతారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిం చడం సరికాదు. అధికారులు ఇప్పటికైనా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. -కె.అరుణ్‌కుమార్ బీసీ సబ్‌ప్లాన్ జిల్లా అధ్యక్షుడు, సామాజికవేత్త
ఇళ్లు పూర్తి చేసి పేదలకు ఇవ్వాలి..
పేదల ఇళ్ల నిర్మాణం సాఫీగా జరిగేలా చూడాలి. ఆక్రమణలను, కబ్జాదారులను అధికారులు ఉపేక్షించొద్దు, వరద కాలువను పూర్తిగా పునరుద్ధరిస్తే సగం సమస్య పరిష్కారమవుతుంది. డబుల్ బెడ్ రూం ఇళ్లు త్వరగా పూర్తి చేసి పేదలకు అందివ్వాలి. – పురుషోత్తం, బీజేపీ సీనియర్ నాయకులు, ఇంజాపూర్