‘ఫికర్ చేయొద్దు…మనో ధైర్యమే మందు’

by Shyam |
‘ఫికర్ చేయొద్దు…మనో ధైర్యమే మందు’
X

దిశ, వనపర్తి : ఫికర్ చేయొద్దు…గుండె నిబ్బరంతో మనో ధైర్యమే కరోనాకు అసలైన మందు అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని, కొవిడ్ చికిత్స అందిస్తున్న ఐసోలేషన్ వార్డులను నిరంజన్ రెడ్డి సందర్శించారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొవిడ్ వైరస్ సోకిన వారిని పరామర్శించి ధైర్యం నింపారు. తాను కొవిడ్ బారినపడి మళ్లీ ఆరోగ్యంగా తిరిగి మీ ముందుకు వచ్చానని ఉదహరించికున్నారు. ఆసుపత్రి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంఛార్జీ డిఎంహెచ్ఓ రవి శంకర్ ను ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు హరీష్ సాగర్, ఆర్‌ఎంవో చైతన్య గౌడ్ ను కొవిడ్ పేషెంట్లకు అందిస్తున్న చికిత్స ను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ని ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని అన్నారు. ప్రజలందరూ కొవిడ్, లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ, ఆంక్షలకు అనుగుణంగా నడుచుకొని కరోనా ను పాలద్రోలెందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ పురపాలక సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, ఆర్డీవో అమరేందర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, రాష్ట్రా దళిత నాయకులు కోళ్ల వెంకటేష్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story