- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడొద్దు..
దిశ, ఏపీబ్యూరో :
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన తొలినాళ్లలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. వైరస్‌కు వ్యాక్సిన్ ఇంకా మార్కెట్‌కు అందుబాటులోకి రాకపోవడంతో ప్రత్యమ్నాయంగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు వినియోగించవచ్చని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. అమెరికా సహా వివిధ దేశాలు భారత్ నుంచి భారీ ఎత్తున హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు దిగుమతి చేసుకున్నాయి. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంపే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు వాడినట్లు ప్రకటించారు. దీంతో ఈ మాత్రలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పలువురు విద్యావంతులు ఈ మాత్రలను కొనుగోలు చేసి రిజర్వ్ చేసుకున్నారు. అలాంటిది హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలు వాడొద్దని ప్రస్తుతం వైద్యులే సూచిస్తున్నారు.
ఏపీలో సీజన్ మారింది. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం లక్షణాలు పలువుర్ని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలేమో అని ఆందోళన చెందుతున్న పలువురు ఆ మాత్రలను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయంతో 60 ఏళ్లపైబడిన వారు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు వినియోగిస్తే కోరి అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లేనని వారు చెబుతున్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు షుగర్, గుండె జబ్బులు, హెచ్ఐవీ, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారిపై కరోనా ఎక్కువ ప్రభావం కనిపిస్తున్నందున హై రిస్క్ జోన్‌లో ఉన్నవారు నెలరోజుల వరకు ఇల్లు దాటి బయటకు రావొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ఇక ఏపీలో 60 ఏళ్లు దాటిన వారు 50 లక్షల మంది వరకూ ఉన్నారని అంచనా. వీరంతా గడప దాటి బయటకు రావొద్దని, వీరి సంక్షేమంపై కుటుంబ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. వీలైతే, వృద్ధులను ప్రత్యేక గదిలో ఉంచాలని, వారు ఇప్పుడు వాడుతున్న మందులనే కొనసాగించాలని సలహా ఇచ్చారు. అంతేకానీ కరోనా సోకకూడదని ముందు జాగ్రత్తతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను మాత్రం వేసుకోవద్దని చెబుతున్నారు. హై రిస్క్ పరిధిలో ఉన్న వారిని గుర్తించి, వారికి వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల సహకారాన్ని, తీసుకుంటున్నట్లు వైద్యశాఖాధికారులు తెలిపారు.