చేపలు, రోయ్యలతో కరోనా సోకదు

by srinivas |
చేపలు, రోయ్యలతో కరోనా సోకదు
X

మాంసం ప్రియులకు ఏపీ మత్స్యశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చేపలు, రోయ్యలతో కరోనా వైరస్ సోకదని వెల్లడించింది. వీటిని వినియోగంతో కరోనా వైరస్ వ్యాపించదని ఆ శాఖ కమిషనర్ జి.సోమశేఖరం తెలిపారు. ఇదే విషయాన్ని భారత ఆహార పరిరక్షణ, ప్రమాణాల సంస్థ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు కూడా ధృవీకరించాయి.
కాగా, మాంసాహారం తినడం వల్ల కరోనా వైరస్ వస్తుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. కిలో చికెన్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ.20- రూ.40 మధ్యకు పడిపోయింది.

Tags: fish, Shrimp, ap fisheries department, ap news

Advertisement

Next Story

Most Viewed