- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాస్తవాలను దాచొద్దు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: గుజరాత్‌లో కొవిడ్-19 హాస్పిటల్‌లో మంటలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు మండిపడింది. ‘మీ ప్రకారం అన్ని సవ్యంగానే ఉన్నాయి. కానీ, మీ అఫిడవిట్ సొంత చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రిపోర్టుకు విరుద్ధంగా ఉన్నద’ని వ్యాఖ్యానించింది. దుర్ఘటనకు సంబంధించి వాస్తవాలను దాచిపెట్టే యత్నం చేయవద్దని హెచ్చరించింది. రాజ్‌కోట్ నగరంలోని కొవిడ్-19 హాస్పిటల్ ఐసీయూలో గతశుక్రవారం చెలరేగిన మంటలకు ఆరుగురు పేషెంట్లు మరణించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు వివరణ ఇవ్వాల్సిందిగా గుజరాత్ సర్కారును ఆదేశించింది. రూపానీ ప్రభుత్వం సమర్పించిన నివేదికను పరిశీలించిన జస్టిస్ అశోక్ భూషణ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం… నిజాలను దాచొద్దని సూచించింది. ‘గుజరాత్ సర్కారు సమాధానాన్ని చూశాం. ఏడో అంతస్తులో ఐదుగురు మరణించారు… ఎలాంటి అఫిడవిట్ ఇది’ అని మండిపడింది. ప్రభుత్వం సరైన రిపోర్టు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతాకు సూచిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.