మహిళలకు పదోన్నతులు వద్దు : నారా లోకేశ్

by srinivas |   ( Updated:2021-08-14 11:07:14.0  )
lokesh
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షకులను కానిస్టేబుళ్లుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా మహిళా సంరక్షకులు ఖాకీ దుస్తులు వేసుకునేందుకు సిద్ధంగా లేరన్నారు. మహిళా శిశు సంక్షేమం అంటూ జాబ్ చార్ట్‌లో పేర్కొని.. ఇప్పుడు వారికి పోలీసు విధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. తుగ్లక్ నిర్ణయాలతో మహిళా సంరక్షకుల జీవితాలతో ఆడుకోవద్దని లోకేశ్ హితవు పలికారు. మహిళా సంరక్షకులను శిశు సంక్షేమ శాఖలో అంతర్భాగం చేయాలన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి విరుద్ధంగా తెచ్చిన జీవో నెం.59 రద్దు చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story