వలస కూలీలకు దాతల ఆపన్నహస్తం

by Shyam |
వలస కూలీలకు దాతల ఆపన్నహస్తం
X

దిశ, వరంగల్ :

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ఉపాధి లేక వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతుల్లో డబ్బులు లేక, తినడానికి తిండి లేకుండా బాధపడుతున్న కూలీలను ఆదుకోవడానికి పలువురు దాతలు ముందుకువచ్చారు. వివరాల్లోకి వెళితే..ఇతర రాష్ట్రాల నుంచి మహబూబాబాద్ జిల్లాకు పనికోసం వలస వచ్చిన కూలీలు ఆకలితో బాధపడకుండా మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కు శ్రీరామ్ ఏజన్సీస్ తరఫున కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేష్ రావులు రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. వారితో పాటే నలందా డిగ్రీ కాలేజీ తరఫున రూ.1లక్ష చెక్కును చైర్మన్ నూకల శ్రీరంగారెడ్డి, ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్, కరెస్పాండెంట్ డోలి సత్యనారాయణ అందించారు. స్వర్ణ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కాంట్రాక్ట్స్ తరఫున మరో రూ.5 లక్షలను సీఎం సహాయనిధికి కొంపల్లి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేష్ రావులు మంత్రి సత్యవతి రాథోడ్‌కు అందజేశారు. వలస కూలీల కోసం విరాళం ఒక్కటే కాకుండా ఇతర వసతులు కల్పించేందుకు ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తామని దాతలు వెల్లడించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శ్రీరామ్ ఏజన్సీస్, నలందా డిగ్రీ కాలేజీ తరఫున రూ.6లక్షల చెక్కులు అందజేసినందుకు మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.

Tags: carona, migrant labour, donations, warangal, minister satyawathi rathod

Advertisement

Next Story