- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రామమందిర విరాళాలు.. రూ.22 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్
దిశ, వెబ్‌డెస్క్ : విశ్వహిందూ పరిషత్ ( వీహెచ్‌పీ)కు పెద్ద షాక్ తగిలింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఆ శాఖ దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు దాతల ద్వారా సుమారు రూ.5 వేల కోట్లకు పైగా విరాళాలు సేకరించారు. అయితే వాటిల్లో 15 వేల చెక్కులు బౌన్స్ అయినట్లు సమాచారం. వీటి విలువ రూ.22 కోట్లు ఉంటుందని తెలిసింది. ఇదే విషయం ఇప్పుడు విశ్వహిందూ పరిషత్ లో చర్చాంశనీయంగా మారింది.
అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం వచ్చిన విరాళాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆడిట్ చేసింది. ఈ ఆడిట్ లోనే చెక్కుల బౌన్స్ విషయం వెలుగు చూసింది. అయితే చెక్కులు సాంకేతిక లోపం వల్ల బౌన్స్ అయ్యాయా.. లేక బ్యాంకు ఖాతాల్లో నిధులు లేకపోవడం వల్ల బౌన్స్ అయ్యాయే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. చెక్కులు బౌన్స్ అయిన వారిని మళ్లీ విరాళాలు ఇవ్వమని కోరతామని ఆయన తెలిపారు.