ఓటేయమంటున్న ఎరిక్ ట్రంప్

by Harish |
ఓటేయమంటున్న ఎరిక్ ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘మిన్నెసోటా ప్రజాలారా.. బయటకు వచ్చి ఓటేయండి’ అని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ అంటున్నాడు. అదేంటి ఆల్రెడీ ఎన్నికలైపోయి, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యాడు కదా అంటారా! కానీ ఆ విషయం ఎరిక్‌కు తెలియదేమో? అందుకే ఎరిక్ ట్రంప్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. చిన్న తప్పు జరిగినా.. పోలోమని మీమ్స్ క్రియేషన్‌కు సిద్ధమయ్యే మీమర్స్.. ఎరిక్‌పై బోలెడన్ని మీమ్స్ సృష్టిస్తున్నారు. ఇక నెటిజన్లు సైతం వ్యంగ్యమైన కామెంట్లతో ఎరిక్‌ను ఆడుకుంటున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి వారం రోజులైపోయాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, రెండోసారి పోటీచేసిన డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయాడు. కానీ ట్రంప్ తన ఓటమిని ఇప్పటికీ అంగీకరించడం లేదు. ఇదిలా ఉంటే, ట్రంప్ కుమారుడు ఎరిక్ చేసిన ట్వీట్ మరింత హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికలు ముగిసిన వారం తర్వాత మంగళవారం (10 నవంబర్ 2020) రోజున ఎరిక్ ట్రంప్ ‘మిన్నెసోటాలోని ప్రజలు ఒయటికొచ్చి ఓటు వేయాలి’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే తన పొరపాటును తెలుసుకుని, డిలీట్ చేసే లోపే అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎరిక్ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో నెటిజన్లు తెగ సెటైర్లు వేశారు.

ఎలక్షన్ డే ట్వీట్‌ను, ఎరిక్ రాంగ్ వీక్‌లో షెడ్యూల్ పెట్టాడేమో, ఎరిక్ ట్రంప్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (ఎందుకంటే.. అది చాలా స్లోగా ఓపెన్ అవుతుంది), మిన్నెసోటా ప్రజలు ఫ్రాడ్ ఓటింగ్ చేయాలేమో అంటూ ఎరిక్ పొరపాటుపై నెటిజన్లు ఆడుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed