Leaked Data : పిజ్జా బ్రాండ్ డొమినోస్ డేటా లీక్!

by Shyam |   ( Updated:2021-05-25 03:43:07.0  )
Dominos
X

దిశ, ఫీచర్స్: ‘డేటా బ్రీచ్’ ఇటీవల కాలంలో సర్వసాధారణమై పోయింది. గతంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్, రైల్ యాత్రి వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లలో కోట్లాది మంది యూజర్ల డేటా లీక్ కాగా, ఇటీవలే 45లక్షల మంది ఎయిర్ ఇండియా ప్యాసింజర్ల డేటా లీకైనట్లు ఆ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా డొమినోస్ ఇండియా యూజర్ల డేటా బ్రీచ్ అయింది. ఇందులో ఏ సమాచారం లీక్ అయింది? దాని వల్ల ఎంతమంది కస్టమర్లు ప్రభావితం కానున్నారు.?

పిజ్జా డెలివరీ సర్వీస్ డొమినోస్ (Domino’s Pizza) ఇండియాకు చెందిన దాదాపు 18 కోట్ల కస్టమర్ల డేటా లీక్ అయినట్లు తొలిగా సైబర్‌ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ సిటిఓ అలోన్ గాల్ ఇటీవల వెల్లడించారు. డొమినోస్ కస్టమర్ల యూజర్ డేటాను డార్క్ వెబ్‌లో రూ.4 కోట్లకు విక్రయించినట్లు ఏప్రిల్‌లో పేర్కొన్నాడు. డేటా బ్రీచ్ వార్తలను గుర్తించిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో హైలైట్ చేశాడు. ఇందులో 130 టిబిల ఉద్యోగుల డేటా ఫైళ్లు, కస్టమర్ వివరాలు ఉన్నాయి. బహిర్గతమైన విషయాలు కొన్ని ఖాతాలకు సరిపోతాయని జాతీయ పత్రికలు ధ్రువీకరించాయి. డేటా లీక్‌లో కస్టమర్ ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీ, జీపీఎస్ లోకేషన్, ఇంటి చిరునామా, పేరు, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఖర్చు చేసిన మొత్తం వంటి లావాదేవీల వివరాలు ఉన్నాయి. డొమినోస్ ఇండియా నుంచి తమ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీని ఉపయోగించి ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ చేసిన ఏ యూజర్ అయినా లీక్ వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

‘ఎండ్ కస్టమర్ డేటాను నిర్వహించే సంస్థలు సైబర్‌ సెక్యూరిటీ సొల్యుషన్స్ అండ్ ప్రాక్టీసెస్, వారి భద్రతను పెంచే పద్ధతుల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. నేటి డిజిటలైజ్డ్ ప్రపంచంలో, ఎండ్ కస్టమర్ సమాచారాన్ని రక్షించడం చాలా అవసరం. ZTNA, DLP, XDR తదితర భద్రతా నిర్వహణ వంటి సాంకేతిక పరిష్కారాలను అమలు చేయడం కీలకం. డేటా నిర్వహణ, విజిలెన్స్, కఠినమైన భద్రతా నియంత్రణలు, ప్రక్రియలు, ఆడిట్‌ వంటి విషయాల్లో ఎంప్లాయ్ ఎడ్యుకేషన్ చాలా అవసరం.’ – ప్రకాష్ బెల్, ఇండియా & సార్క్, కస్టమర్ సక్సెస్, SE లీడ్ హెడ్

Advertisement

Next Story