- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూఎస్ ఓపెన్‌లో రికార్డు ఎవరిది?
దిశ, స్పోర్ట్స్ : టాస్ సీడ్ ఆటగాళ్ల గైర్హాజరీ, నెంబర్ వన్ ఆటగాడు జకోవిచ్ అనూహ్యంగా అనర్హత వేటు పడి యూఎస్ ఓపెన్ నుంచి వెనుదిరగడంతో ఈ సారి సరికొత్త విజేతను చూసే అవకాశం లభించింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన రెండు సెమీఫైనల్స్‌లో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్, ఆస్ట్రియా ఆటగాడు డోమినిక్ థీమ్‌లు విజయం సాధించి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు.
తొలి సెమీస్‌లో 20వ సీజ్ పాబ్లో కరేనో బస్టా, 5వ సీజ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌లు తలపడ్డారు. క్వార్టర్స్‌లో జకోవిచ్‌పై అనర్హత వేటు పడటంతో సెమీస్ చేరిన పాబ్లో బస్టా దూకుడుగా ఆట మొదలు పెట్టాడు. తొలి రెండు సెట్లను 6-3, 6-2 తేడాతో గెలిచి జ్వెరెవ్‌ను ఆత్మరక్షణలో పడేశాడు. అయితే మూడో సెట్‌లో పుంజుకున్న అలెగ్జాండర్ జ్వెరెవ్ తర్వాత 6-3, 6-4, 6-3 తేడాతో వరుస సెట్లను గెలుచుకొని ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు.
తొలి రెండు సెట్లను కోల్పోయిన తర్వాత మ్యాచ్‌ను గెలవడం జ్వెరెవ్ కెరీర్‌లో ఇదే తొలిసారి. కాగా ఒక జర్మన్ టెన్నిస్ ఆటగాడు యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లోకి అడుగుపెట్టడం 26 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారి. 1994లో జర్మన్‌కు చెందిన మైఖేల్ స్టిచ్ యూఎస్ ఓపెన్ ఫైనల్స్ ఆడాడు.
ఇక రెండో సెమీస్‌లో తలపడిన డోమినిక్ థీమ్ 6-2, 7-6, 7-6 తేడాతో వరుస సెట్లలో మెద్వెదేవ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్ నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ దూసుకొని పోతున్న డోమినిక్ థీమ్ సెమీస్‌లో కూడా అదే ఊపుతో మెద్వెదేవ్‌ను ఓడించాడు. ఆస్ట్రియాకు చెందిన ఆటగాడు యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
గత 16 ఏళ్లలో రోజర్ ఫెదరర్, రఫేల్ నదాల్, జకోవిచ్ లేకుండా సెమీఫైనల్స్ ఇవే కావడం గమనార్హం. మరోవైపు ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన ఇద్దరికీ ఇదే తొలి యూఎస్ ఓపెన్ ఫైనల్స్. వీరిద్దరిలో ఎవరు గెలిచినా 1990 తర్వాత పుట్టిన టెన్నిస్ ప్లేయర్ గెలిచే తొలి యూఎస్ టైటిల్ కానుంది.