- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటల ఎఫెక్ట్.. హుజురాబాద్ టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు.?
దిశ, హుజురాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు షురూ అయినట్టుగా కనిపిస్తోంది. తమకు సమాచారం ఇవ్వలేదన్న అసహనం వ్యక్తం చేసే పద్దతి మొదలైంది. తాజాగా బుధవారం బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఈ సన్నివేశానికి వేదికగా నిలిచింది. మీడియా సమావేశంలో కృష్ణమోహన్ ప్రసంగించే ముందు జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్.. టౌన్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌పై అసహనం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్‌కు అన్ని ఏర్పాట్లు నీవే చేస్తే ఎలా.. ముందు సమాచారం ఇచ్చేది లేదా అంటూ మండిపడ్డారు. ఇవన్నీ ఏంటి.. కుర్చీలు, టేబుల్స్ అన్ని ఏర్పాటు చేస్తావా.. అన్ని నీవే చేస్తే ఎలా అంటూ టౌన్ అధ్యక్షునిపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో అవాక్కయిన టౌన్ అధ్యక్షుడు సమాధానం చెప్తూ కామ్‌గా కూర్చున్నాడు. ఈటల పార్టీకి దూరం కాగానే స్థానిక నాయకుల్లో ఆదిపత్య పోరు మొదలైందా.? అన్న విషయంపై పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు.