- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మనిషిలా రెండు కాళ్లపై నడుస్తున్న శునకం
దిశ, ఫీచర్స్ : 6 ఏళ్ల బ్రిటనీ స్పానియల్ డాగ్ మనిషిలా నడుస్తూ ఇంగ్లాండ్ వాసులను ఆశ్చర్యపరుస్తోంది. కారు ప్రమాదంలో ముందరి కాళ్లను కోల్పోయిన ‘డెక్‌స్టర్’ అనే శునకం పట్టుదలతో శ్రమించి వెనుక కాళ్లతో నడవడం నేర్చుకుంది. మెల్లమెల్లగా ప్రావీణ్యం సంపాదించి ప్రస్తుతం అవలీలగా నడుస్తోంది.
శునకాలను ఎంతో గారాబంగా, అల్లారుముద్దుగా పెంచుకోవడం సర్వసాధారణం. ‘డెక్‌స్టర్’ను కూడా అదేవిధంగా చూసుకున్న కెంటీ పసెక్ అనే వ్యక్తి.. దానికి థాంక్యూ ఇవ్వడం, గుట్టలు ఎక్కడం, ఆదేశాలు పాటించడం, ఏదైనా వస్తువు విసిరేస్తే తీసుకురావడం వంటి అంశాల్లో తర్ఫీదు ఇచ్చేవాడు. ఒకానొక రోజు తమ యార్డ్‌లో ఓ వస్తువు విసిరేయగా దాని పట్టుకునేందుకు పరిగెత్తుతూ ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్‌కు గురైంది. దీంతో దాని ముందరి కాళ్ళలో ఒకటి తీసేయాల్సి వచ్చింది. మరొక కాలు కూడా తీవ్రంగా దెబ్బతినడంతో భారం మోయలేకపోయింది. మొత్తానికి 45 నిమిషాల ఆపరేషన్ అనంతరం డెక్‌స్టర్ ప్రాణాలతో బయటపడింది. అయితే ప్రమాదం జరిగిన రెండు నెలల తర్వాత ‘డెక్‌స్టర్’ను గార్డెన్‌కు తీసుకెళ్లగా మనిషిలా తన వెనుక కాళ్ళపై ఆధారపడుతూ నడిచేందుకు ప్రయత్నించింది. కానీ అలా నడవడం వల్ల మళ్లీ ఏదైనా ప్రమాదం తలెత్తే అవకాశముందని భావించిన పసెక్.. దానికి కస్టమ్ వీల్స్ అమర్చాడు. అయితే డెక్‌స్టర్ మాత్రం వెనక కాళ్ల మీద నడిచేందుకే ఇష్టపడింది. ఇందుకు పసెక్ కూడా సహకరించడంతో నడవడం ప్రాక్టీస్ చేసింది.
డెక్‌స్టర్ వెనుక కాళ్లపై నడవడమే తనకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. దాని సామర్థ్యం ఆన్‌లైన్‌లో సంచలనంగా మారింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మేము పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మిలియన్ సంఖ్యలో ప్రజలు డెక్‌స్టర్ కనెక్ట్ అవుతున్నారు. కొందరు మాత్రం ఇది తనలో ఒత్తిడి పెంచుతుందని సలహా ఇస్తున్నారు. కానీ మేము రెగ్యులర్‌గా వెటర్నరీ డాక్టర్‌తో చెకప్ చేయిస్తున్నాం. ముందు కాలు ఇప్పటికీ తనకు నొప్పి కలిగిస్తుంది. ఏదేమైనా మా జీవితంలో ఇప్పటికీ డెక్‌స్టర్ ఉన్నందుకు మేము కృతజ్ఞులం. వెటర్నరీ వైద్యుడి ప్రకారం.. డెక్‌స్టర్ ఇలాగే సంతోషంగా ఉంటే మరో నాలుగేళ్లు హ్యాపీగా జీవిస్తుందని తెలిపాడు.
– పసెక్