- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామాంధుడిని అక్కడ కరిచి.. యజమాని మానం కాపాడిన కుక్క
దిశ, ఏపీ బ్యూరో: కుక్కలు విశ్వాసానికి ప్రతీక అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాస్త ఆదరిస్తే చాలు.. వాటి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి యజమానుల్ని కాపాడుకుంటాయి. అలాంటి ఘటనలు ఎన్నో ఉదాహారణలు ఉన్నప్పటికీ తాజాగా ఓ పెంపుడు కుక్క తన యజమాని మానాన్ని కాపాడింది. ఆమెపై ఓకామాంధుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా.. పెంపుడు కుక్క అతడి భరతం పట్టింది. అతడిని కరిచి, పోలీసులకు పట్టించింది. కామాంధుడి చెర నుంచి యజమానిని కాపాడి తన విశ్వాసం నిరూపించుకుంది.
చిత్తూరు జిల్లాలోని గొల్లపల్లి గ్రామంలో ఓ 17 ఏళ్ల బాలిక డాబాపై నిద్రపోతుంది. బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన 27ఏళ్ల వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. షాక్ తిన్న బాలిక.. కామాంధుడి చెర నుండి తప్పించుకోవడానికి కేకలు వేసింది. డాబా కింద నిద్రపోతున్న వారి పెంపుడు కుక్క ఆమె అరుపులు విని ఒక్క ఉదుటున డాబాపైకి వెళ్లింది. బాలికతో పెనుగులాడుతున్న వ్యక్తి పైకి దూకింది. అతడిపై దాడి చేస్తూ.. కాళ్లు, నడుముపై కరిచింది. ఒకవైపు కుక్క.. మరోవైపు బాలిక అరుపులకు కుటుంబ సభ్యులు, పొరుగువారు నిద్రలేచి వచ్చారు. దీంతో ఖంగుతిన్న కామాంధుడు గోడ దూకి పరారీ అయ్యాడు.
పెంపుడు కుక్క అప్రమత్తతో బాలిక కామాంధుడి చెర నుంచి బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి తీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెనుమూరు బస్టాండ్‌లో ఓ వ్యక్తి అనుమానస్పదంగా బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి శరీరంపై కుక్కగాట్లు ఉండటంతో అతడే నిందితుడని నిర్ధారించుకోని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఆపదలో ఉన్న తన యజమాని పట్ల విశ్వాసాన్ని చూపి, అత్యాచారం నుంచి కాపాడిన కుక్కను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.