- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్ట్రిక్ కార్ల తయారీకి తొందరపడట్లేదు : మారుతీ సుజుకి ఛైర్మన్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో పరిశ్రమలో ఇప్పటికే టాటా మోటార్స్, హ్యూండాయ్ ఇంకా ఇతర కార్ల తయారీదారులు ఎలక్ట్రానిక్ వాహనాల(ఈవీ) తయారీ విభాగంలోకి ప్రైవేశించాయి. అయితే, దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి మాత్రం ఈవీ విభాగంలోకి ప్రవేశించేందుకు తమ సరైన సమయం అనుకోవట్లేదని కంపెనీ చైర్మన్ ఆర్ సి భార్గవ చెప్పారు. దేశీయంగా డిమాండ్ మరింత పుంజుకునే వరకు వేచి ఉండటమే మేలని భావిస్తున్నట్టు ఆయన అన్నారు. ప్రస్తుతం ఏడాదికి 20 లక్షల కార్లను విక్రయిస్తున్న తమ కంపెనీ ఏడాది 5000-15,000 ఈవీ కార్ల విభాగంలో రావడం సమంజసమని భావించట్లేదన్నారు. డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉండాలని, అప్పుడే తాము ఈవీ విభాగంలోని ప్రవేశించనునట్టు ఆర్ సి భార్గవ తెలిపారు.
బుధవారం సంస్థ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మార్కెట్ పరిస్థితులు, ధర, బ్యాటరీల లభ్యత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కంపెనీ తమ మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2025 నాటికి విడుదల చేస్తుందని భార్గవ స్పష్టం చేశారు. ప్రత్యేకంగా తాము హైబ్రిడ్ కార్ల తయారీపై దృష్టి సారిస్తున్నామన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మారుతీ సుజుకి నికర లాభాలు 65 శాతం క్షీణించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభాలు రూ. 1,372 కోట్ల నుంచి ఈసారి రూ. 475 కోట్లకు పడిపోయాయి. త్రైమాసిక పరంగా 7 శాతం వృద్ధి నమోదవడం సంతోషంగా ఉందని కంపెనీ తెలిపింది. ఇక, కార్యకలాపాల ఆదాయం రూ. 20,539 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.