- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల కమిషన్‌కు ప్రజల ఇబ్బందులు కనిపించడం లేదా.?
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతుంటే ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించిందని, వారికి ప్రజల ఇబ్బందులు కనిపించట్లేవా అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కోఆర్డినేషన్ కన్వినర్ నిరంజన్ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయాలని కమిషనర్ పార్థసారధిని కోరుతూ నిరంజన్ గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కరోనా తీవ్రతను పట్టించుకోని ఎన్నికల కమిషన్ తీరు దురదృష్టకరమన్నారు.
కరోనా నిబంధనలను రాజకీయ నాయకులు పాటించడం లేదని చెబుతున్నా ఎన్నికల కమిషన్ తన బాధ్యతను ఎందుకు విస్మరిస్తుందో చెప్పాలని కోరారు. ఈ రోజు విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రచార సమయాన్ని కుదించిందే తప్ప ఎన్నికలను వాయిదా వేయలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుందా చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమైందని కమిషన్ చెప్పిందని, మరి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులకు ఎన్నికలను ప్రకటించకుండా ద్వంద్వ వైకరిని చూపిస్తుందన్నారు.