- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG BREAKING: రాఖీ పండుగ నాడు సోదరి రూ. 15 కంటే ఎక్కువ అడిగితే 10 ఏళ్లు జైలు శిక్ష.. లక్ష రూపాయల జరిమానా?
దిశ, ఫీచర్స్: ‘‘వెల కట్టలేని బంధాలను వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనం. సమస్య ఎంత జఠిలమైనా, సమయమే పగ పట్టినా, సోదరుడున్నాడు అని తెలిపే ధైర్య బంధమే రక్షాబంధన్. కష్ట నష్టాలు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నా, సోదరి అనే ఒక తోడును ఇచ్చే ప్రేమ బంధమే ఈ రాఖీ పండుగ’’. కాగా అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే రాఖీ పండుగ రానే వచ్చేసింది. ఈ ఏడాది రాఖీ ఆగస్టు 19 వ తేదీన వస్తుంది. రాఖీ పండుగను రాఖీ అని లేదా రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో శ్రావన పూర్ణిమ అని అంటారు.
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రాఖీ ఒకటి. ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా ఉండాలని జరుపుకునే పండుగ. ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. రాఖీ అంటే రక్షణ అర్థం. బంధన్ అంటే సూత్రం కట్టడం అని అర్థం. దీన్నే రక్షాబంధన్ అంటారు. అన్నాదమ్ముళ్లు విజయం వైపుగా అడుగులు వేయాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ తమ సోదరీ రాఖీ కడుతుంది. దీంతో సోదరుడు ఏ కష్టమొచ్చినా నీకు అండగా నిలుస్తానని హామీ ఇస్తాడు. రాఖీ కట్టాక సోదరీమణుల్ని సంతోష పెట్టడానికి సోదరులు చిరుకానుకలు అందిస్తాడు.
రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే..?
మహాభారతంలో ద్రౌపది, క్రిష్ణుల మధ్య అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంతో గొప్పదని పండితులు చెబుతారు. శిశుపాలుడిని శిక్షించే సమయంలో కృష్ణుడు తన సుధాసన చక్రాన్ని ప్రయోగిస్తాడు. దీంతో కృష్ణుడి వేలుకు గాయమై విపరీతంగా రక్తం దారగా కారిపోతుంటుంది. అక్కడే ఉన్న సత్యభామ ఏం చేయాలో ఆలోచిస్తుంటే ద్రౌపది మాత్రం తన చీర కొండు చింపి కృష్ణుడు వేలికి కట్టు కడుతుంది. ఇందుకు కృష్ణుడు ఎప్పుడు ఆమెకు తోడుగా ఉంటానని మాట ఇస్తాడు. ఇక అప్పటి నుంచి ఎప్పుడూ, ఏ సమయంలోనైనా, ఏ కష్టం వచ్చిన తోడుగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇస్తాడు. ఇక ఆ రోజును గుర్తుగా పశ్చిమ భారతదేశం అండ్ దక్షిణ భారతదేశం రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటుంది.
అయితే రాఖీ పండుగ నాడు అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టాక అక్కాచెల్లెళ్లకు కట్న కానుకలు సమర్పిస్తారన్న విషయం తెలిసిందే. కొంతమంది తమకు తోచినంత మనీ లేదా బహుమతులు అందిస్తారు. మరికొంతమంది తమ సిస్టర్స్‌ను ఆనందపరిచేలా భారీ బడ్జెట్‌తో సర్పైజ్ గిఫ్ట్స్‌లు ఇస్తుంటారు. అయితే ఈ సంవత్సరం రాఖీ పండుగ నాడు సోదరీమణులు.. సోదరుడికి రాఖీ కట్టాక 15 రూపాయల కంటే ఎక్కువ మనీ అడిగినట్లైతే పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందట. అంతే కాదండోయ్.. పైగా లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తారట. రాఖీ పండుగ వస్తుందని.. తమ తమ అక్కాచెల్లెళ్లు ఎక్కడ డబ్బు అడిగేస్తారని ముందే కొంతమంది సోదరులు బ్రేకింగ్ న్యూస్ అంటూ ఈ ఫన్నీ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది వీక్షించిన నెటిజన్లు ‘ఎన్ని నిబంధనలు వచ్చినా ఆచారంగా వచ్చే పద్ధతి మీరు పాటించక తప్పదు.. మీరు కట్న కానుకలు ఇవ్వక తప్పదు’ అంటూ పగలబడి నవ్వుతోన్న బొమ్మలు జోడించి కామెంట్లు చేయగా.. అక్కాచెల్లెళ్లు జాగ్రత్త అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.