శభాష్ సుమలత.. ఒకే కుటుంబంలో ముగ్గురికి డాక్టరేట్

by Shyam |
శభాష్ సుమలత.. ఒకే కుటుంబంలో ముగ్గురికి డాక్టరేట్
X

దిశ, చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామ్ నగర్ కాలనీకి చెందిన కట్కూరి సమలత కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్ పొందారు. గణిత శాస్త్ర విభాగం భారతీ శర్మ ఆధ్వర్యంలో అప్లికేషన్స్ ఆఫ్ యునివాలెంట్ అనలైటిక్, మల్టి వాలెంట్ ఫంక్షన్స్ అనే అంశంపై పీహెచ్‌డీ అవార్డు అందుకున్నారు. సుమలత కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

చదువు‌పై మక్కువతో కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. తన పరిశోధన అనంతరం కాకతీయ యూనివర్సిటీ ఆమెకు అవార్డును ప్రదానం చేసింది. మహిళలు చదువుకు పేదరికానికి అడ్డుకాదని సుమలత నిరూపిస్తూ డాక్టరేట్ పట్టా పొందడం మండలానికి గర్వకారణమని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన చదువుకు ఆమె భర్త నర్సింహులు ఆదర్శమని సుమలత చెప్పారు. కాగా ఒకే కుటుంబంలో నర్సింహులుకు, తన భార్య సుమలతకు, తమ్ముడు మహేందర్‌కు డాక్టరేట్ పట్టాలు పొందడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed