- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ లేదు.. డాక్టర్ రమేశ్ రెడ్డి క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి ముగింపు దశలో ఉందని డీఎంఈ డా.రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. వైరస్ ప్యాండమిక్ నుంచి ఎండమిక్ స్టేజ్ కు వచ్చినట్లు తెలిపారు. విస్తృతంగా వ్యాక్సినేషన్ నిర్వహించడం వలనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సడలించి 4 నెలలైనా కేసుల సంఖ్య అతి స్వల్పంగా ఉందన్నారు. మరిన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటే పూర్తి నియంత్రణకు వచ్చినట్లేనని తెలిపారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ లేదన్నారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తతో అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యాలను అందుబాటులో ఉంచామన్నారు. సెకండ్ వేవ్ లో చూసిన పరిస్థితులు ఉండవని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
కొన్ని చోట్ల మాత్రమే కేసులు తేలుతాయన్నారు. కొత్త కరోనా వచ్చిందనే వార్తల్లో నిజం లేదన్నారు. తాము నిత్యం అధ్యయనం చేస్తున్నామన్నారు. మరోవైపు చిన్నారుల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని, వారికి సోకినా తీవ్ర ఇబ్బందులు ఉండవన్నారు.
- Tags
- corona