‘లేడీ లవ్’ పీపీటీ మీకు తెలుసా?

by Sujitha Rachapalli |   ( Updated:2020-09-11 04:35:54.0  )
‘లేడీ లవ్’ పీపీటీ మీకు తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగం కోసం రెజ్యూమేలు తయారు చేసే రోజుల నుంచి, ‘డేటింగ్ రెజ్యూమే’లు రూపొందించే ట్రెండ్‌లోకి ఇప్పుడు దూసుకొచ్చాం. పెండ్లి చేసుకునే అమ్మాయి కోసం మ్యాట్రిమోనీ సైట్‌లు వెతుకుతారు. అదే డేటింగ్ చేయాలంటే ‘టిండర్’‘బంబుల్’ వంటి వెబ్‌సైట్ జల్లెడ పట్టేస్తారు. మరి ప్రేమికురాలు కావాలంటే ఏ సైటు చూపించలేదు. అందుకే డేటింగ్ ప్లస్ ప్రేయసి లవ్ రెండూ ఒకేసారి పొందేందుకు ఓ మలేషియా వైద్యుడు హిల్లారియస్ ‘పవర్ పాయింట్ ’ప్రజెంటేషన్‌ ఇచ్చి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. ఆ కథేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..లెట్స్ గో..

మలేషియాకు చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ మహమ్మద్ నఖీబ్ ‘జాబ్ వెకెన్సీ’ ఉందంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు..తనకు జీవితాన్ని కూడా ఇస్తానంటున్నాడు. అందుకోసం ‘వై యూ షుడ్ డేట్ మీ?’ నువ్వు నాతో డేట్ ఎందుకు చేయాలంటే ? అని తన క్వాలిటీస్, ఇంట్రెస్ట్స్, ప్రోజ్, కాన్స్ అన్నింటినీ పీపీటీ ద్వారా వివరించాడు.

‘‘నఖీబ్‌కు ఫన్నీగా ఉండటమంటే ఇష్టం. కుకింగ్ చేస్తాడు. చక్కగా నిద్రపోతాడు. పెట్స్‌తో ఆడుకుంటాడు. అతడి చేతిలో ఎప్పుడూ ఓ చాక్లెట్ ఉంటుంది. అన్ని రకాల గేమ్స్ ఆడతాడు. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌తో పాటు ఆపిల్ మ్యూజిక్ అకౌంట్ కూడా ఉంది. గుడ్ మ్యూజిక్ టేస్ట్ ఉంది. కానీ, వాళ్లమ్మ తన గొంతు ఎక్కువ లౌడ్‌గా ఉందంటుంది. చూసేందుకు అందంగా ఉండడు. కానీ, మంచిగానే కనిపిస్తాడు.’’ అని నఖీబ్ చెబుతున్నాడు. పెద్ద ప్రమాదకారి కూడా కాదు. కానీ, ఎత్తులంటే మాత్రం చచ్చేంత భయం అని చెప్పుకొచ్చాడు. అయితే, తన మాజీ టీచర్ మాత్రం నఖీబ్ అత్యంత చెత్త బ్యాచ్‌లోని విద్యార్థి అని రివ్యూ ఇచ్చింది. ఇక తన బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం డాక్టర్ ఫన్నీ అని పిలుస్తారని తెలిపాడు. ఐఫోన్, కారుతోపాటు ట్విట్టర్‌లో 900 మంది ఫాలోవర్లు ఉన్నారు. డాక్టరే కానీ, ఇంకా పేదవాడినే అని నఖీబ్ అంటున్నాడు.

అమ్మాయికి బెన్‌ఫిట్స్:

శాలరీ విషయానికొస్తే..అమ్మాయి పర్ఫామెన్స్ ఆధారంగా మంత్లీ కమిషన్ ఉంటుంది. బర్త్ డే బెనిఫిట్స్ అదనం. ఇక క్వాలిఫికేషన్ అంటే మంచిగా చదువుకోవడంతోపాటు, పరిణతి కలిగిన అమ్మాయి కావాలి. ఇది 24/7 జాబ్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డాక్టర్ నఖీబ్ వేసే జోకులకు తను కూడా నవ్వాలి. ఫ్యామిలీ ఈవెంట్స్ కూడా రావాలి. ప్రొహిబిషన్ పీరియడ్ 1-3 నెలల వరకు ఉంటుంది. ఇలా వివరాలు చెబుతూ..నఖీబ్ సరాదాగా దీన్ని ట్విట్టర్‌లో పోస్ చేశాడు. కానీ, ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

Advertisement

Next Story