- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలేయంలో పెరుగుతున్న ‘పిండం’.. అరుదైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ!
దిశ, ఫీచర్స్ : సాధారణ గర్భధారణలో ‘ఫలదీకరణ గుడ్డు’ గర్భాశయంలో అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ యుటెరస్ బయట ఫలదీకరణ గుడ్డు పెరిగితే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ సంభవిస్తుంది. ఇలాంటి గర్భం ఫెలోపియన్ ట్యూబ్(అండాశయాల నుంచి గర్భాశయానికి గుడ్లను తీసుకువెళ్లే ట్యూబ్)లో సంభవిస్తుంది. దాన్ని ట్యూబల్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తుండగా.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇది జరుగుతుంది. కాగా కెనడాలోని ఓ మహిళ ఇలాంటి ప్రెగ్నెన్సీని పొందింది. తన కాలేయంలో పిండం పెరుగుతుండగా.. దీన్ని వైద్యచరిత్రలోనే అరుదైన సంఘటనగా అభివర్ణించారు వైద్యులు.
ఎక్టోపిక్ గర్భం సాధారణంగా నిలవదు. ఫలదీకరణమైన గుడ్డు మనుగడ సాగించదు. కానీ పెరుగుతున్న కణజాలం ప్రాణాంతక రక్తస్రావాన్ని కలిగిస్తుంది. వెంటనే సదరు మహిళకు చికిత్స చేయకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధి, దెబ్బతిన్న లేదా మచ్చలు కలిగిన ట్యూబ్స్ లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి సందర్భాల్లో సంభవించొచ్చు. ఇలాంటి అరుదైన సందర్భమే కెనడా వైద్యులకు ఎదురైంది. 33 ఏళ్ల మహిళ తనకు వరసగా 14రోజుల నుంచి రుతుస్రావం కావడంతో వైద్యుల వద్దకు వెళ్లింది. తనకు పరీక్షలు నిర్వహించగా ‘కాలేయం’లో పిండం పెరుగుతున్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. ఇలాంటి కేసు కోట్లలో ఒకరికి ఉంటుందని వివరిస్తూ.. ఇందుకు సంబంధించిన వివరాలను టిక్‌టాక్ వీడియోలో పంచుకోగా, అది కాస్త వైరల్ అయింది.
“ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చికిత్స చేయగలిగినప్పటికీ, ఇది తల్లి జీవితానికి అధిక ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ముందుగానే గుర్తించడం కీలకం. గర్భం దాల్చిన వెంటనే అల్ట్రాసౌండ్ ద్వారా దీన్ని నిర్ధారించవచ్చు. ఈ రోజుల్లో ఐవీఎఫ్‌ని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. గర్భధారణ సమయంలో బీటా హెచ్‌సిజి హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. సోనోగ్రఫీ, రక్త పరీక్షతో నిర్ధారణ అయిన తర్వాత.. అది చిన్నగా, పగిలిపోకుండా ఉంటే వైద్యపరంగా చికిత్స చేయవచ్చు” అని గైనకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పూనమ్ అగర్వాల్ తెలిపారు.