నోబుల్ నర్సింగ్ హోం సీజ్..

by Shamantha N |
నోబుల్ నర్సింగ్ హోం సీజ్..
X

చిత్తూరు జిల్లా తిరుపతిలో లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్న నోబుల్ నర్సింగ్ హోంను వైద్యాధికారులు సీజ్ చేశారు. 10రోజుల కిందట రజిత అనే మహిళకు డాక్టర్ బాషా లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహించి అనంతరం గర్భస్రావం చేశాడు. దీంతో ఆమెకు కడుపులో కొన్ని పేగులు కట్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారిణి ఆమెను రుయాకు తరలించి నర్సింగ్ హోంపై దాడులు నిర్వహించారు. ఆసమయంలో లింగ పరీక్షలు చేస్తున్న బాషాను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. బాషాకు పరీక్షలు చేసే అర్హత లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని, పరీక్షల్లో ఆడబిడ్డ అని తేలితే భ్రూణహత్యలకు కూడా పాల్పడుతున్నాడని జిల్లా వైద్యాధికారిణి వెల్లడించింది. పోలీసులు బాషాను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.

Advertisement

Next Story