పెళ్లి చేసుకున్న నోరా ఫతేహి

by Anukaran |   ( Updated:2020-07-22 01:58:40.0  )
పెళ్లి చేసుకున్న నోరా ఫతేహి
X

దిశ, వెబ్ డెస్క్ : ‘మనోహరి’ అంటూ.. తన అందచందాలతో కైపెక్కించిన భామ నోరా ఫతేహీ. ఐటెం, స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ అందిస్తోంది. తన డ్యాన్స్ వీడియోలతో అభిమానులను ఖుషీ చేసే.. ఈ బాలీవుడ్ బ్యూటీ తన భర్త ఎవరో ఇన్ స్టా వేదికగా తాజాగా చెప్పింది. జాన్ అబ్రహం సినిమా ‘సత్యమేవ జయతే’ సినిమాలో‘దిల్ బర్ ’ అనే పాటలో నోరా ఫతేహీ చేసిన డ్యాన్స్ మూవ్స్ కుర్రకారునే కాదు.. చిన్నారులను కూడా అలరించింది. ఈ క్రమంలోనే.. .ఓ చిన్నోడు.. నోరా ఫతేహీ డ్యాన్స్‌లకు ఫిదా అయిపోయాడు. ఏకంగా… నోరాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. అ బుడ్డోడికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అ చిన్నోడిని ఎవర్నీ పెళ్లి చేసుకుంటావని అడిగితే.. ‘దిల్ బర్ వాలీ లఢీకి కే సాత్’ అంటూ క్యూట్‌గా సమాధానమిచ్చాడు. ఆ చిన్నోడి అభిమానానికి ..నోరా ఫ‌తేహీ కూడా మనసు పారేసుకుంది. నాకు భర్త దొరికాడు అంటూ .. పెళ్లి చేసుకోబోతున్నాను..అంటూ రియాక్ట్ అయ్యింది. దాంతో ఈ పోస్టు కాస్త వైరల్ అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed