ఆ సైరన్ వాడితే అంతే సంగతి..!

by Sumithra |
ఆ సైరన్ వాడితే అంతే సంగతి..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:

వాహనాలతో కిక్కిరిసిపోతున్న రోడ్లు, జనం రోడ్డుపై ఉన్నప్పుడు పోలీస్ సైరన్ వినిపించి తమ వాహనాలు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకునే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయింది. ఒక్కోసారి పోలీసులు కూడా సైరన్ విని తమ డిపార్ట్‎మెంట్‎కు చెందిన ఆఫీసర్లు అనుకుని అలర్ట్ అయిన సంఘటనలూ ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులు పోలీస్ సైరన్‎తో ప్రజలను కంగారు పెట్టించే ప్రయత్నానికి చెక్ పెడుతున్నారు రామగుండం పోలీసులు.

గోదావరిఖని వన్‎టౌన్ పరిధిలో కారుకు పోలీస్ సైరన్ పెట్టుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు సైరన్ ఉపయోగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న సమాచారంతో సంతోష్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు సీఐ పర్శ రమేష్ తెలిపారు. సంతోష్‎పై మోటార్ వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇకపై పోలీస్ సైరన్ ఉపయోగించే వారు తమ వాహనాల నుంచి వాటిని తొలగించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని సీఐ రమేష్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed