- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయొద్దు
దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై రాజకీయంగా దుమారం రేపింది. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రకటించగా…పెడితే సహించేది లేదని బీజేపీ నేతలు ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అయితే ప్రొద్దుటూరు వెళ్లి మరీ ఆందోళన చేశారు.
అయితే ఈ అంశంపై తాజాగా జిల్లా కలెక్టర్ స్పందించారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారని సోము వీర్రాజు ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఎమ్మెల్యే రాచమల్లు ప్రయత్నించారని అన్నారు. అయితే ఆయన కుట్రలను బీజేపీ నేతలు, హిందువులు భగ్నం చేశారన్నారు. ఇది హిందువులు, బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన గొప్ప విజయమని వీర్రాజు అభిప్రాయపడ్డారు.