- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటలను బీజేపీలోకి రానివ్వకండి.. బండి సంజయ్‌కి లేఖ
by Sridhar Babu |
X
దిశ ప్రతినిది, కరీంనగర్: ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకోవడంపై పునః పరిశీలించాలని ఈటల రాజేందర్ దళిత బాధిత సంఘం కోరింది. సోమవారం హుజురాబాద్ లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఈటల బాధిత సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని దళితులపై అక్రమ కేసులు పెట్టించిన ఈటలను బీజేపీలోకి చేర్చుకుంటే పార్టీకి దళితులు దూరం అయ్యే ప్రమాదం ఉన్నదని వారు బండి సంజయ్ కి వివరించారు.
ఈటల అక్రమ ఆస్థుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టించాడని సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ తెలిపారు. కొంతమందిపై పీడీ యాక్టులు కూడా పెట్టారని చెప్పారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈటలను బీజేపీలో చేర్చుకోకపోవడమే పార్టీకి మంచిదని సూచించారు.
Advertisement
Next Story