- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఎంకే మ్యానిఫెస్టో: ప్రసూతి సెలవులు 12 నెలలు.. విద్యా రుణాలు మాఫీ
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ శనివారం మ్యానిఫెస్టో విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు వెలువడుతున్న చమురు ధరలను మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. తాము అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 4 రూపాలయను తగ్గిస్తామని వివరించారు. వంట గ్యాస్ ఎల్పీజీపై రూ. 100 సబ్సిడీ ఇస్తామని హామీనిచ్చారు. ప్రైవేటు రంగంలో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు, విద్యా రుణాల మాఫీలనూ మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. మహిళలకు ప్రసూతి సెలవులను 12 నెలలకు పొడిగిస్తామని, పిల్లలకు ఉదయం పూట ఉచితంగా పాలను అందిస్తామని పేర్కొన్నారు. 30ఏళ్ల లోపు విద్యార్థుల ఎడ్యుకేషన్ లోన్‌లను మాఫీ చేయనున్నట్టు మ్యానిఫెస్టో వివరించింది. దివంగత సీఎం జే జయలలిత మరణంపై కమిషన్ వీలైనంత తొందరగా రిపోర్టు రూపొందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. హిందూ దేవాలయాల యాత్రలు చేసే లక్ష మందికి రూ. 25వేల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు పేర్కొంది. హిందు ఆలయాల మరమ్మతులకు రూ. 1000 కోట్లు, చర్చిలు, మసీదులకు రూ. 200 కోట్లను కేటాయించనున్నట్టు వెల్లడించింది.