- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రధాని మోడీపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..
దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి తొలిసారిగా బరిలోకి దిగుతోండగా, ప్రతిపక్ష డీఎంకే పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. సర్వేలన్నీ డీఎంకేకు అధికారం రాబోతోందని జోస్యం చెబుతున్న క్రమంలో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో దూకుడును పెంచారు.
ఈ క్రమంలోనే శనివారం ప్రధాని మోడీపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ ఎన్నికల్లో గెలవడం లేదని ఆరోపించారు. చాలా చోట్ల అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని స్టాలిన్ విమర్శించారు. సీబీఐ, ఎన్నికల సంఘం, ఐటీ, సుప్రీంకోర్టును చేతుల్లో పెట్టుకుని అందరినీ బెదిరిస్తూ ప్రభుత్వాలను నడుపుతున్నారని’’ మండిపడ్డారు. మోడీ క్రేజ్ రానురాను తగ్గిపోతుందని అన్నారు.