‘దిశ’ కథనానికి స్పందన.. ఆ ఆస్పత్రి సిబ్బందికి వార్నింగ్

by vinod kumar |
Midjil Government Hospital
X

దిశ, జడ్చర్ల: కరోనా పేషెంట్లను కుక్కల కంటే హీనంగా చూస్తూ.. రోగులకు ఇవ్వాల్సిన మందులను ఆస్పత్రి ఆవరణలో మందులు కింద పడేసి పేషెంట్ల పట్ల జడ్చర్ల జిల్లాలోని మిడ్జిల్ ప్రభుత్వాసుపత్రి ఫార్మసిస్ట్ బాలు దారుణంగా ప్రవర్తించారు. దీనిపై ‘దిశ’ పేపర్‌లో ‘కరోనా రోగులు అంటే ఇంత నిర్లక్ష్యమా?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు డీఎంహెచ్ఓ‌తో ఫోన్ మాట్లాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ విజయ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి సదరు ఆస్పత్రిని సందర్శించారు. కరోనా రోగుల పట్ల ఫార్మాసిస్ట్ బాలు దారుణంగా ప్రవర్తించిన నిజమే అని నిర్ధారించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బాలుని హెచ్చరించారు.

అయితే.. బాలుపై చర్యలు తీసుకుంటే, ప్రస్తుత కరోనా సమయంలో ఆ ప్రభావం మిగతా ఉద్యోగులపై పడుతుందని భావించి, చర్యలు తీసుకునేందుకు ఇది సరైన సమయం కాదని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. కాగా, ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రతి వైద్య సిబ్బందిపై ఉందని తెలిపారు. అలాగే కరోనా నిర్ధారణ పరీక్షల కోసం నిజంగా లక్షణాలు ఉన్నవారు మాత్రమే టెస్టులు చేయించుకోవాలని, లక్షణాలు లేనివారు చేయించుకుంటే లక్షణాలున్న వారికి నష్టం వాటిల్లుతుందని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed