సీజనల్ వ్యాధుల నివారణకు అలర్ట్‌గా ఉండాలి

by Sridhar Babu |
సీజనల్ వ్యాధుల నివారణకు అలర్ట్‌గా ఉండాలి
X

దిశ‌, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లాలో సీజ‌న‌ల్ వ్యాధులు వ్యాప్తి చెంద‌కుండా అధికారులు అప్ర‌మ‌త్త‌ంగా వ్యవహరించాలని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా వైద్యాధికారి భాస్క‌ర్ అన్నారు. మంగ‌ళ‌వారం డీఎంహెచ్‌వో కార్యాల‌యంలో వివిధ విభాగాల అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా భాస్క‌ర్ మాట్లాడుతూ..జిల్లాలో అత్య‌ధికంగా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నందున అధికారులు ముంద‌స్తు చ‌ర్య‌లు చేపట్టాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, ఫైలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు సబ్ యూనిట్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు.ఈ ఏడాది 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 293 ఎంపిక చేసిన గ్రామాల్లో 56,100 దోమ తెరలను పంపిణీ చేయనున్నట్టు వివరించారు. అలాగే 444 ఎంపిక చేయబడిన గ్రామాల్లో రెండు విడతలుగా స్ప్రేయింగ్ చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ లేకుండా చూడాలని ప్రజలకు సూచించారు.కార్య‌క్ర‌మంలో డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు ప్రోగ్రాం అధికారి, జిల్లా ఉపమీడియా, విస్తరణ అధికారి ఎల్ చంద్రశేఖర్, సబ్ యూనిట్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed