చార్మినార్ వద్ద పండుగ వేడుకలు.. గవర్నర్ తమిళిసై రాకతో సందడి

by Sridhar Babu |   ( Updated:2021-11-04 04:06:07.0  )
Governar-1
X

దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావళి పండుగ పర్వదిన వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దీపావళి పూజ అనంతరం అమ్మవారికి మహాహారతి పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, మంత్రి సత్యవతి రాథోడ్, కె. కవిత, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ కె. లక్ష్మణ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, ఉమా మహేంద్ర తదితరులు హాజరై భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అశేష భక్త జనకోటికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటి వరకు వేలాది మంది భక్తులు పాల్గొని, అమ్మవారికి పూజలు నిర్వహించారు. దీంతో చార్మినార్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.

Minister-Rathod-2

Advertisement

Next Story