‘గని’ కార్మికులకు దీపావళి బోనస్.. అక్టోబర్ 4న కీలక సమావేశం

by Sridhar Babu |   ( Updated:2021-09-28 22:24:55.0  )
‘గని’ కార్మికులకు దీపావళి బోనస్.. అక్టోబర్ 4న కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్ : సింగరేణి కార్మికులకు ప్రతియేటా చెల్లించే దీపావళి బోనస్ (లాభాల వాటా) విషయమై అక్టోబర్ 4న సమావేశం నిర్వహించనున్నట్టు బీఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షులు వై. సారంగపాణి తెలిపారు. కోల్ ఇండియాలో జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించి పీఎల్‌ఆర్ బోనస్ ఖరారు చేయనున్నట్టు సమాచారం. ఐదు జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో బీఎంఎస్ తరఫున లక్ష్మారెడ్డి, ఎబికెఎంఎస్ ప్రధాన కార్యదర్శి సుధీర్ గురై హాజరవుతారని ఆయన తెలిపారు.

Advertisement

Next Story