- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సింగరేణి మాజీ కార్మికులకు దీపావళి బోనస్ చెల్లింపు
దిశ, బెల్లంపల్లి: సింగరేణి సంస్థలో గత ఏడాది పదవీ విరమణ చేసిన కార్మికులకు దీపావళి బోనస్ చెల్లింపులను చేయనున్నట్టు బెల్లంపల్లి ఏరియా గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాసరావు వెల్లడించారు. పదవి విరమణ పొందిన కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించేందుకు సింగరేణి చైర్మన్ సీఅండ్ ఎండి శ్రీధర్ తో హైదరాబాదులో శుక్రవారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు బి.వెంకటరావు తో పాటు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి లు ప్రత్యేకంగా విన్నవించడంతో స్పందించిన సింగరేణి సి.ఎం.డి ఒప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు .సింగరేణి యాజమాన్యం గత ఏడాది ఏప్రిల్ 1 నుండి అక్టోబర్ 20 వరకు పదవి విరమణ పొందిన కార్మికులకు ఈనెల 22వ తేదీన బోనస్ చెల్లింపులను మాజీ కార్మికులు పనిచేసిన విభాగాలలోని ఏరియాలలో చెల్లించనున్నారు. పదవి విరమణ పొందిన మాజీ కార్మికులకు దీపావళి బోనస్ ఇప్పించేందుకు కృషి చేసిన గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాసరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.