- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె కన్య కాదు.. ఇద్దరు అక్కాచెల్లెల్లకు విడాకులు ఇవ్వండి
దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని కులాల ఆచారాలు వింతగానూ, విచిత్రంగా ఉంటాయనడంలో సందేహం లేదు. వారి సంస్కృతి ఆధారంగా అనాధిగా వాటిని ఆచరిస్తూ వస్తుంటారు. అయితే ఆ ఆచారాలు అందిరికి మేలు చేసేవిగా ఉంటే పర్వాలేదు కానీ, కీడు చేస్తేనే నష్టం. అదే జరిగింది ఓ అక్కాచెల్లెల్ల విషయంలో. పెళ్లై ఆరు నెలల గడవక ముందే భర్తల నుంచి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కంజర్భట్ అనే తెగ నివాసం ఉంటుంది. ఆ తెగ ఆచారం ప్రకారం పెళ్లైన నవ వధువుకు కన్యత్వ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే రాజారామ్ పురికి చెందిన ఇద్దరు అక్కచెల్లెల్లకు గత నవంబర్‌లో బెల్గాంలోని ఇద్దరు అబ్బాయిలతో వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిసిన అనంతరం ఆ ఇద్దరు వధువులకు కుల పెద్దలు కన్యత్వ పరీక్ష చేశారు. వారిలో ఓ యువతి ఆ టెస్ట్‌లో ఫెయిల్ అయింది.
అయితే తను ఏ తప్పు చేయలేదని, కన్యత్వం ఎలా పోయిందో తెలియదని ఆ యువతి వేడుకున్న కుల పెద్దలు వినలేదు. ఇదే క్రమంలో అత్తింటి వారు సైతం ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేశారు. భర్త శోభనం కూడా చేయకుండా దూరం పెట్టాడు. కుల పెద్దలు పంచాయితీ నిర్వహించి.. కన్యత్వం లేనందుకు భర్తలకు విడాకులు ఇవ్వాలని తీర్పు చెప్పారు. అయితే వధువుల్లో ఒక్కరే కన్యత్వం పరీక్షల్లో విఫలం కాగా, ఇద్దరు అక్కాచెల్లెలకు విడాకులు ఇవ్వాలని కుల పెద్దలు తీర్పు ఇవ్వడం గమనార్హం. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆ ఇద్దరు అక్కాచెల్లెల్లు తమకు న్యాయం చేయాలని రాజారామ్ పురి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.