- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుశాఖలో నాన్‌కేడర్ అధికారుల విభజన
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: పోలీసుశాఖలో నాన్‌కేడర్ అధికారుల కేటాయింపు పూర్తయ్యింది. పునర్విభజన చట్టానికి అనుగుణంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో కేంద్రం ఈ కేటాయింపులను చేసింది. రాష్ట్ర విభజన అనంతరం అన్నివిభాగాల్లో అధికారుల కేటాయింపు పూర్తయినప్పటికీ ప్రమోషన్లు, ఇతరత్ర వ్యవహారంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు, విధులు నిర్వహిస్తున్న అధికారులకు భిన్నాభిప్రాయాలు ఉన్నందున ఈ విభజన ప్రక్రియ నిలిచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ముందస్తుగా సీనియార్టీ ప్రకారం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నాన్‌కేడర్ అధికారులకు పదోన్నతులు కల్పించాయి. అనంతరం అధికారుల నుంచి ఆప్షన్లను కోరింది. ఈ వివాదంపై అనేక దఫాలుగా చర్చించిన పిదప ఈనెల మూడో వారంలో కేటాయింపుల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఫైనల్ జాబితాను విడుదల చేసింది.
ఈ ప్రకారం పోలీసుశాఖ నాన్‌కేడర్ ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు మొత్తం 632మంది తమ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. దీంతో తెలంగాణ రాష్టానికి 250మంది, ఏపీకి 382మంది అధికారులను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రానికి నాన్‌కేడర్ ఎస్పీ విభాగంలో 9మంది, అడిషనల్ ఎస్పీలు 49మంది, డీఎస్పీలు 192మంది, ఏపీకి 16మంది ఎస్పీలు, 64మంది అడిషనల్ ఎస్పీలు, 302మంది డీఎస్పీలు ఉన్నారు. దీంతో పోలీసు శాఖలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల విభజన సమసినట్టు అయ్యింది.