- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి వేముల ఇలాకాలో నిధులు మాయం.. అధికార పార్టీ నేతల హస్తం..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్: అధికారులు, పాలకవర్గ సభ్యులు చేతులు కలిపి.. రైతుల సొమ్మును వారికే తెలియకుండా పక్కదారి పట్టించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 15 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాడ్ల రాంపూర్ సొసైటీలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపుతోంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఇలాకాలో రైతుల సొమ్ము పక్కదారి పట్టడం రాజకీయ వర్గాల్లో చిచ్చు రేపుతోంది. దీంతో రైతులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు.
మూడు దశాబ్దాల చరిత్ర.. 3 వేల మంది రైతుల సభ్యత్వం.. కోట్ల రూపాయల టర్నోవర్‌తో.. ఓ వెలుగు వెలిగిన తాడ్ల రాంపూర్ సహకార సొసైటీ.. గత పాలక వర్గం అడ్డగోలు నిర్ణయాలతో నష్టాల ఊబిలో చిక్కుకుంది. చివరకు రైతులు దాచుకున్న సొమ్మును కూడా పక్కదారి పట్టించారు. సుమారు వేయి మంది రైతులు తమ డబ్బును సొసైటీలో డిపాజిట్ చేశారు. కూతుళ్ల పెళ్లీల కోసం కొందరు, ఇళ్ల నిర్మాణం కోసం మరికొందరు, ఇతర అవసరాలకు ఇంకొందరు లక్షల్లో డిపాజిట్ చేశారు. అయితే, నిధుల మెచ్యూరిటీ గడువు ముగిసిన అన్నదాతలు తమ డబ్బుల కోసం సొసైటీకి వెళ్లగా.. నిధుల దారి మళ్లింపు వ్యవహారం బయటపడింది.
ఫిర్యాదు చేసినా..
తాడ్ల రాంపూర్ సొసైటీలో అక్రమాలు జరగలేదని, రైతుల డిపాజిట్‌లతో సొసైటీ ఆస్తులను పెంచారని పలువురు అధికారులు చెబుతున్నారు. అయితే, అనుమతులు, సొసైటీ తీర్మాణం లేకుండా నిధుల దారి మళ్లింపు ఎలా చేశారో తెలియజేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే వ్యవహారంపై రైతులు సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా సహకార శాఖాధికారి ఆదేశాల మేరకు విచారణ కూడా జరిగింది. విచారణలో డిపాజిట్ల అంశం పక్కదారి పట్టిందనే విమర్శలు ఉన్నాయి. సొసైటీలో ఆక్రమాలు జరగలేదని క్లీన్ చీట్ ఇచ్చినట్లు పలువురు సభ్యులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అంతేకాకుండా, విచారణ అధికారి తీరు కుడా అనుమానాస్పదంగా ఉందని ఫిర్యాదులు రావడం గమనార్హం.
మంత్రి వద్దకు నిధుల వ్యవహారం..
ఇటువంటి పరిస్థితుల నడుమ రైతులు తాడ్ల రాంపూర్ సొసైటీ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. న్యాయం చేయాలని ఇప్పటికే సహకార అధికారులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చివరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వద్దకు నిధుల దారి మళ్లింపు విషయాన్ని తీసుకెళ్లారు. న్యాయం చేసేవరకు ధర్నా కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.
ధర్మపురి ఆరోపణలు..
ఇది ఇలా ఉంటే.. గత నెల 28న తాడ్ల రాంపూర్‌లో రైతుల ధర్నాకు బీజేపీ ఎంపీ అర్వింద్ మద్దతు ఇచ్చారు. రూ. 15 కోట్ల దారి మళ్లింపులో అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ధర్మపురి కామెంట్లతో ఈ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచింది. మంత్రి ఇలాకాలో జరిగిన వ్యవహారంపై వేముల ఏ విధంగా స్పందిస్తారో అన్న అంశం సర్వత్రా చర్చనీయాంశం అయింది.