- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ కబ్జాలపై విచారణ చేయాలి
దిశ, సూర్యాపేట: జిల్లాలోని మఠంపల్లి మండలం దామరచర్లలో కబ్జాకు గురైన దళితుల భూముల విషయంపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే సర్వే చేయించి దళితులకు న్యాయం చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కేశపంగు రాములు ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేటలోని పోలీస్ గెస్ట్‌హౌస్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దళితులు తమకు న్యాయం చేయాలని ఆయనకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారులు తక్షణమే సర్వే చేయించి, ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. 1972లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు మఠంపల్లి ప్రాంతంలో అసైన్డ్ భూములను ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. స్థానిక ఆర్డీవో, తహసీల్దార్ స్థాయి అధికారులు అవకతవకలకు పాల్పడి, ప్రైవేట్ వ్యక్తులకు దళితుల భూముల పట్టాలు ఇవ్వడంతో దళితులకు అన్యాయం జరిగినట్టు ఎస్సీ కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ సంజీవరెడ్డి తదితరులు రాములను కలిసారు.