పార్క్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి

by Shyam |
పార్క్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వీలైనంత త్వరగా పార్క్‌ను గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. మద్దూర్ మండలం వీరారం గ్రామాన్ని కలెక్టర్ ఆదివారం సందర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పార్క్‌ను పరిశీలించారు. పార్క్‌లో దాదాపు 3 నుంచి 4 వేల మొక్కలు నాటడం జరిగిందని, పార్క్‌లో గ్రామస్తులకు మార్కింగ్ వాక్ కోసం ప్రత్యేక వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే చిన్న పిల్లలకు ఆడుకోవడానికి ప్రత్యేక పార్కుని కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే మండలంలోని లింగల్ చెడ్డ్, భూనెడు గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక స్థలాన్ని పరిశీలించి పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మీరు నిర్మించే ప్రతి భవనాలకు చుట్టుగా మొక్క లను ఏర్పాటు చేయాలని, మీ డంపింగ్ యార్డు, స్మశాన వాటికలలో చుట్టూ మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Advertisement

Next Story