- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్మీ లాగా మున్సిపల్ సిబ్బంది కూడా..
దిశ, చెన్నూర్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ రమేష్ కు 10 పీపీఈ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి రవీందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని, పట్టణాన్ని కరోనా బారి నుంచి ప్రజలను రక్షించడానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నారని, సరిహద్దుల్లో సైనికులు ఎలా పని చేస్తున్నారో అలాగే పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారని, వారికి కావాల్సిన సదుపాయాల కోసం ప్రతి ఒక్కరూ చేయూత నివ్వాలని ఆయన అన్నారు.
మంచిర్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని, దానికోసం ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మెడికల్ కాలేజీ ప్రారంభమైతే తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ అందుగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సుశీల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్, లక్ష్మణ్, చింతల శ్రీనివాస్ ,గణేష్, శ్రీకాంత్ రాజులు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.