ఇటుకబట్టీ కార్మికులకు మాస్కుల పంపిణీ

by vinod kumar |
ఇటుకబట్టీ కార్మికులకు మాస్కుల పంపిణీ
X

దిశ, వరంగల్ :
వలస కార్మికులు ఎక్కడున్నా వారి బాగోగులు చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండల కేంద్రంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగారు. ఒడిషా నుంచి వలసొచ్చి ఇక్కడి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న సుమారు 200 మంది కార్మికులకు ప్రభుత్వం తరఫున అందుతున్న సదుపాయాలను స్వయంగా పర్యవేక్షించారు. పల్లవి మెమోరియల్ ట్రస్టు తరఫున వారికి ఆహార పదార్ధాలు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ట్రస్టు చైర్మన్ కోటేశ్వరరావు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వైద్య సేవలు కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. బట్టీ పనులు ఆగిపోవడంతో వారికి అవసరమైన ఆహారపదార్ధాలతో పాటు బట్టలు, ఇతర సౌకర్యాలను కూడా సమకూరుస్తామని భరోసానిచ్చారు.

Tags: Telangana, Corona, Warangal Rural, ACP Srinivas, Pallavi Memorial Trust, Koteswara Rao, Masks, Sanitizers, Migrant labourers

Advertisement

Next Story

Most Viewed