పారిశుధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ

by Shyam |
పారిశుధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ
X

దిశ, హైదరాబాద్: ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని వెల్‌టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లను శనివారం పంపిణీ చేశారు. ప్రతి ఏడాది మలేరియా పట్ల ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు ట్యాంక్‌బండ్ నెక్లెస్‌రోడ్‌పై 5కే రన్ నిర్వహించేదని, కానీ ప్రస్తుత లాక్‌డౌన్‌తో 5కే రన్ రద్దు చేసినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు. సికింద్రాబాద్, తార్నాక, మెట్టుగూడ, అడ్డగుట్ట ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేసినట్టు వెల్ టెక్ ఫౌండేషన్ ఛైర్మన్ వీరాచారి చిలువూరి చెప్పారు. కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రుడావత్ పాల్గొన్నారు.

Tags: Corona Effect, Malaria Day, Well Tech Foundation, Nursing Officers Association, Laxman Rudavath, Distribution of Masks to Sanitary Workers

Advertisement

Next Story