- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హరీష్ రావు బర్త్ డే : కార్మికులకు నిత్యవసర సరుకుల పంపిణీ
దిశ సిద్దిపేట : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేటలోని భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు సిద్దిపేట జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
గురువారం రంగదాంపల్లిలోని రెడ్డి సంక్షేమ భవనంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముక్కిస సత్యనారాయణ రెడ్డితో కలిసి ఆయన వంద మంది భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు నిరుపేద కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సేవే నా లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న హరీష్ రావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు గౌసోద్దీన్, కరుణాకర్, మల్లేశం, రాజు, తదితరులు ఉన్నారు.