- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత కొవిడ్ బాధితుల శాంపిల్స్‌లో కొత్త లక్షణం
భారతదేశ కొవిడ్ బాధితుల శాంపిల్స్‌లో ఒక సరికొత్త లక్షణాన్ని హైద్రాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కొవిడ్ 19 బారిన పడిన వారి శాంపిళ్లలోనే ఈ లక్షణం ఎక్కువగా కనిపించినట్లు వారు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక వైరస్ పాపులేషన్ క్లస్టర్‌కు ‘క్లాడే ఎ3ఐ’ అని పేరు కూడా పెట్టారు. భారతదేశంలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన 64 జీనోమ్‌లలో 41 శాతం వాటిలో ఈ ‘క్లాడే ఎ3ఐ’ లక్షణం కనిపించనట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది ఇప్పటివరకు ఇండియాకే పరిమితమైనదని సీసీఎంబీ ట్వీట్ కూడా చేసింది.
ఫిబ్రవరి 2020లో మొదలైన ఈ క్లస్టర్.. భారతీయ శాంపిల్స్‌లో 41 శాతం ఉండగా, ప్రపంచ శాంపిల్స్‌లో కేవలం 3.5 శాతం మాత్రమే కనిపించింది. అయితే ఈ క్లస్టర్ ఒక్క ఇండెక్స్ పేషెంటు నుంచి దేశం మొత్తం వ్యాపించి ఉండొచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది ముఖ్యంగా కొవిడ్ 19 మొదట్లో సోకిన వారిలోనే ఎక్కువగా కనిపించినట్లు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు. ఇదే క్లస్టర్ ఢిల్లీ శాంపిల్స్‌లో కొద్దిగా కనిపించిందని, కానీ మహారాష్ట్ర, గుజరాత్ శాంపిల్స్‌లో అసలు దీని జాడలే లేవని రాకేశ్ వెల్లడించారు. ప్రపంచంలో చూస్తే ఈ క్లస్టర్ కేవలం సింగపూర్, ఫిలిప్పీన్స్ దేశాల్లో మాత్రమే కనిపించిందని ఆయన అన్నారు. ఈ క్లస్టర్ గురించి మరింత స్థాయిలో అధ్యయనం చేయడానికి రానున్న రోజుల్లో ఎక్కువ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ చేయబోతున్నట్లు మిశ్రా చెప్పారు. ఈ క్లస్టర్ గురించి కేవలం ఇండియాలో మాత్రమే అధ్యయనం జరుగుతోందని ఆయన తెలిపారు.