- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మా' ఎన్నికల్లో ఉద్రిక్తత.. రిగ్గింగ్ ఆరోపణలు.. కోర్టుకు పంచాయతీ
దిశ, వెబ్‌డెస్క్: ‘మా’ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక వ్యక్తి రిగ్గింగ్ చేస్తున్నాడంటూ మంచు విష్ణు బృందం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. దీంతో కాసేపు పోలింగ్ నిలిచిపోయింది. రిగ్గింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలింగ్ సిబ్బంది పట్టుకుని విచారిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు బృందాలను పిలిపించిన ఎన్నికల అధికారి.. రెండు బృందాలతో చర్చిస్తున్నారు.
రిగ్గింగ్ చేసినట్లు తేలితే ఫలితాలు ప్రకటించనని, మా ఎన్నికల వ్యవహారంపై కోర్టుకు వెళతానని ఎన్నికల అధికారి ప్రకటించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామన్నారు. అటు మా పోలింగ్ కేంద్రంలో గొడవ జరిగింది. పోలింగ్ బూత్ వద్ద బెనర్జీపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపేస్తానంటూ బెనర్జీని మోహన్ బాబు బెదిరించారు. ప్రకాశ్ రాజ్ పోలింగ్ కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారని విష్ణు వర్గం ఆరోపించింది. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. శివబాలాజీ-హేమ, శివబాలాజీ-సమీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
- Tags
- maa elections