పీఆర్సీపై భోధన్‌లో అసంతృప్తి.. IFTU ఆధ్వర్యంలో ధర్నా…

by Shyam |   ( Updated:2021-06-16 06:33:15.0  )
protest for PRC
X

దిశ, బోధన్ : తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్‌టీ‌యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల వేతనం 19 వేల కనీస వేతనం చెల్లిస్తూ, దానిపైన 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలంటూ బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అంతేకాకుండా మున్సిపల్ శాఖ మంత్రి, బోధన్ మున్సిపల్ కమిషనర్ లకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఫ్‌టీయూ) రాష్ట్ర నాయకులు బి. మల్లేష్ మాట్లాడుతూ… వేతనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు చేదు కబురేనని అన్నారు.

ప్రస్తుతం వారు పొందుతున్న వేతనం 12వేల పైన 30 శాతం పెంచీవ్వడం అంటే, పీఆర్సీ లో పేర్కొన్న కనీస వేతనం కన్నా తక్కువే నని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల వేతనాలు పెంచాలని, ఎన్‌ఎంఆర్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, వారికి గతంలో ఇచ్చిన ప్రకారం ఇంక్రిమెంట్లు ఇవ్వాలని,ఫీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూమన్న, ప్రభాకర్, మహేష్, శేఖర్, రాజు, విజయ్, పొశెట్టి, మరియమ్మ , రేణుక, పొశవ్వ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed