- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్ లో అల్లర్లు: టూల్‌కిట్ తయారు చేసి గ్రేటాకు పంపారు
దిశ,వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారిన టూల్ కిట్ అంశంపై ఢిల్లీ సైబర్ పోలీస్ జాయింట్ కమిషనర్ ప్రేమ్ నాథ్ స్పందించారు. యాక్టివిస్ట్ దిశారవి, శాంతను, నిఖితా జాకోబ్ లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఖాలిస్తాన్ ఉద్యమాన్ని సపోర్ట్ చేయడంతో పాటు.., ఆ ఉద్యమానికి మద్దతు పలికే కెనడాకు చెందిన పీజేఎఫ్ (పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్)తో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. దీంతో పాటు జనవరి 26న జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అల్లర్లు చెలరేగేలా టూల్ కిట్ ను తయారు చేసి.., రైతుల భవిష్యత్ కార్యచరణ గురించి స్వీడన్ కు చెందిన 18ఏళ్ల ఎన్విరాన్ మెంటల్ యాక్టివిస్ట్ ‘గ్రేటా థన్‌బర్గ్’కు షేర్ చేశారని తెలిపారు. ఆ టూల్ కిట్ లోని డేటా ఫిబ్రవరి 4న అనుకోకుండా వెలుగులోకి వచ్చిందన్నారు.
కెనడాకు చెందిన పునీత్ అనే యువతి పీజేఎఫ్ ఫౌండర్ మో ధాలివాల్ లు నిఖితతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. దిశారవి, నిఖితా జాకోబ్ తో పాటు ఇలా 60మంది జూమ్ మీటింగ్ లో టూల్ కిట్ గురించి మాట్లుకున్నారని, జనవరి 26న రైతుల ఆందోళనలో పిజికల్ గా లేదంటే డిజిటిల్ గా అల్లర్లు చెలరేగేలా ఏం చేయాలో టూల్ కిట్ లో రూపొందించినట్లు ఉందన్నారు. ఇక రెండో ప్లాన్ ప్రకారం భారత్ లోని సాంస్కృతిక వారసత్వం మరియు విదేశాలలో రాయబార కార్యాలయాలపై దాడి చేయాలో స్పష్టంగా ఉందని’ ప్రేమ్ నాథ్ అన్నారు.
ఫిబ్రవరి 4న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టామని, విచారణలో పై ఆధారాలన్నీ గుర్తించామని సీపీ ప్రేమ్ నాథ్ వివరించారు. టూల్ కిట్‌కు సంబంధించిన డేటా స్క్రీన్ షాట్లు వెలుగులోకి వచ్చాయని, దర్యాప్తు కోసం తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే టూల్‌కిట్ ఎడిటర్‌లలో ఒకరైనా నికితా జాకబ్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 9 న కోర్టు నుండి సెర్చ్ వారెంట్‌ను పొందామని ఢిల్లీ సైబర్ పోలీస్ జాయింట్ కమిషనర్ ప్రేమ్ నాథ్ చెప్పారు.