- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాముడి పేరిట దోపిడీ’ వెనుకుందెవరు?
దిశ, భద్రాచలం : “రాముడి పేరిట దోపిడీ” శీర్షికన శుక్రవారం ‘దిశ’ దినపత్రిక, వెబ్‌సైట్‌లో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. అధికార యంత్రాంగం ఉలిక్కిపడేలా చేసింది. ‘దిశ’లో వచ్చిన వార్త క్లిప్పింగులు రోజంతా సోషల్ మీడియాలో ఫార్వార్డ్ అవుతుండగా, పలువురు ఫేస్‌బుక్‌లో పోస్టుచేయగా లైక్‌లు, కామెంట్స్ వస్తున్నాయి. అసలు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏం జరుగుతోంది. 2014, 2018 లలో దొడ్డిదారిన అమెరికా వెళ్ళిన పూజారులు ఎవరు అనేది ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులు కూడా విచారణకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదోరకం కుంభకోణం.. రామయ్యకి శఠగోపం
అమెరికాలో జరిగే సీతారాముల కల్యాణం తీరు చూడబోతే ఓ పెద్ద కుంభకోణంలా కనిపిస్తోందని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుడు బూసిరెడ్డి శంకర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో అర్చకులతోపాటు అధికారులు కూడా కుమ్మక్కై దేవస్థానానికి రావాల్సిన ఆదాయం దోచుకుంటున్నట్లుగా తెలుస్తోందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. గతం నుంచి కల్యాణాల్లో శ్రీరాముని పేరుని రామనారాయణగా మార్చడం, ఆ తర్వాత అంతరాలయాల్లో నగలు మాయం, ఇపుడు దేశవిదేశాల్లో రాములోరి కల్యాణం సొమ్ములు కాజేయడం వంటి అపచారాలు అనేకం జరుగుతున్నా పట్టించుకునేవారు లేరని ఆయన ఆరోపించారు. అమెరికా కల్యాణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.