- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ ఎఫెక్ట్.. సైట్‌లో ఈటల పేరు తొలగింపు
దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఇంకా వైద్యారోగ్య శాఖ మంత్రిగానే కొనసాగిస్తూ వచ్చిన ప్రభుత్వ వెబ్‌సైట్లలో గురువారం ఉదయం మార్పులు చేశారు. వైద్యారోగ్య శాఖకు చెందిన ఆయా వెబ్‌సైట్లలో మంత్రిగా ఈటలనే చూపిస్తూ వస్తున్నారు. కీ పాయింట్లలో గౌరవ మంత్రి ఈటల రాజేందర్‌గానే కొనసాగిస్తున్నారు. ఈ అంశాన్ని ‘దిశ’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి నెల రోజులు గడుస్తున్నా.. వివరాలను అప్‌డేట్ చేయలేదంటూ ‘దిశ’ కథనం ప్రచురించింది.
దీంతో కళ్లు తెరుచుకున్న వైద్యారోగ్య శాఖ, ప్రభుత్వం.. ఈ పోర్టల్స్ అన్నింటిని అప్‌డేట్ చేసింది. దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా సంబంధిత శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నెల రోజులు గడుస్తున్నా పాత అడ్రస్, పాత వివరాలు, ఈటల రాజేందర్ మంత్రి.. వంటి వివరాలన్నీ తొలగించకపోవడంపై సీరియస్ అయినట్లు అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెప్పారు. దీంతో గురువారం ఉదయమే మొత్తం అప్‌డేట్ చేశారు.
వైద్యారోగ్య శాఖ వెబ్‌సైట్లలో గౌరవ మంత్రి అనే స్థానాన్ని ఖాళీగా ఉంచారు. ఈ శాఖ ప్రస్తుతం సీఎం దగ్గరే ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు చెందిన అన్ని వెబ్‌సైట్లలో సీఎం కేసీఆర్ ఫోటో ఒక్కటే ఉంచారు. మిగిలిన మంత్రి, అధికారులు, ఉన్నతాధికారులకు సంబంధించిన ఫొటోలన్నీ వెబ్‌సైట్ నుంచి తొలగించారు.