- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘దిశ’ కథనంతో ‘దారి’కొచ్చారు..!
దిశ ప్రతినిధి, వరంగల్: ఆరు నెలలుగా ఆగుతూ.. సాగుతున్న హన్మకొండ బస్టాండ్ రోడ్డు నిర్మాణ పనులు ‘దిశ’ కథనంతో మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. రూ.9కోట్లతో హన్మకొండ బస్టాండ్ నుంచి అలంకార్ జంక్షన్ వరకు నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రముఖ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. డ్రెయినేజీ నిర్మాణ పనులకు సంబంధించి కొంత అస్పష్టత నెలకొనడంతో రోడ్డు పనులను కూడా జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో హన్మకొండ, వరంగల్, కాజీపేటలను కలిపే ప్రధాన రహదారి నిర్మాణం పేరుతో ఆరు నెలలుగా మూసివేయడంతో జనాలు నరకం అనుభవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దిశ పత్రికలో ఈనెల 18న “చౌరస్తా వెళ్లాలంటే చుట్టూ తిరుగుడే.!” కథనం ప్రచురితమైంది. ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక ప్రజాప్రతినిధులు విషయాన్ని కాంట్రాక్టు సంస్థ బాధ్యుల వద్దకు తీసుకెళ్లడంతో పనుల్లో వేగం పెంచినట్లు సమాచారం. రోడ్డు నిర్మాణానికి సంబంధించి కంకరతో పాటు కందకాల తీత, పూడ్చివేత వంటి పనులు చేపట్టడం మంగళవారం కనిపించింది. పనులను వేగవంతం చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాంట్రాక్టు సంస్థ యజమాని కూడా జిల్లాలోని ప్రముఖ ప్రజాప్రతినిధి కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
చౌరస్తా వెళ్లాలంటే చుట్టూ తిరుగుడే.!
‘దిశ’ కథనం.. వారిపై కేటీఆర్ సీరియస్